Hindi Devotional Songs and Stories

This blog is all about our culture and heritage

Thursday, February 4, 2010

Ramachandraya Janka


ప : రామచంద్రాయ జనక రాజజామనోహరాయ

మామకాభీష్టదాయ మహితమంగళం


చ : కౌశలేశాయ మందహాస దాసపోషణాయ

వాసవాది వినుత సద్వరదమంగళం


చ : చారుకుంకుమోపీత చందనాదిచర్చితాయ

హారకటక శోభితాయ భూరిమంగళం


చ : లలితరత్నకుండలాయ తులసీ వనమాలికాయ

జలజ సదృశదేహాయ చారుమంగళం


చ : దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ

భావజ గురువరాయ భవ్యమంగళం


చ : పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ

అండజ వాహనాయ అతులమంగళం


చ : విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ

సుజన చిత్తకామిదాయ శుభదమంగళం


చ : రామదాస మృదులహృదయ తామరసనివా(సా)య

స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం

No comments:

Post a Comment